జాతీయరహదారిపైనున్న బావిలోకి పడిపోయిన యువకుడు

0 33

చిమ్మ చీకట్లో రెండు గంటపాటు నరక యాతన
తాళ్ల సహాయంతో పైకి లాగిన ఏఎస్ఐ, యువకులు

రాజమండ్రి ముచ్చట్లు :

- Advertisement -

ఆలమూరు మండలం జొన్నడ  పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయరహదరిపై డివైడర్ మధ్య నూతులో ప్రమాదవశాత్తు పడిపోయిన యువకున్ని స్థానిక యువకుల సహకారంతో పైకి లాగి రక్షించిన ఏఎస్ఐ …వివరాల్లోకి వెళితే అంగర గ్రామానికి చెందిన శిరుగుశెట్టి సతీష్ కిరాణా వ్యాపారి.శుక్రవారం సాయంత్రం తన మారుతి వెన్ లో రాజమండ్రి కరిదుకి బయలుదేరాడు. ఈ క్రమంలో జొన్నడ జహదారిపైకి వచ్చేసరికి బహిర్బుమికి వెళ్లేందు వెన్ పక్కకు అపి డివైడర్ దాటుతుండగా నూతిలో పడిపోయాడు.ఈ నూతులను డివైడర్ మధ్య ప్రధాన కాలువ నీరు జొన్నడ పిల్ల కలులోకి వెళ్లేందుకు తూములు ఏర్పాటు చేశారు.అందులోని చెత్తను తొలగించేందుకు అనువుగా మూడు నూతులను ఏర్పాటు చేశారు. ఇవి సుమారు 15నుండి 20వై అడుగుల లోతు ఉన్నాయి.ఇది గమనించని యువకుడు ఒక్కసారిగా నూతిలో పడిపోయాడు. రెండు గంటలపాటు కేకలు వెయ్యగా అటుగా వెళ్తున్న స్థానిక యువకుడు బూర్రి గమనించి పోలీస్ వారికి సమాచారం అందించాడు. దింతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఏ యస్ ఐ సూర్యచంద్ర తక్షణమే స్పందించి స్థానిక యువకులతో తాళ్ల సహాయంతో పైకి లాగి కుటుంబీకులకు సమాచారం అందించారు. యువకునికి తలకు గాయమై రక్తస్రావం అయింది.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:A young man who fell into a well on the national highway

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page