డివిజన్ లో రెవెన్యూ సిబ్బంది మంచి సహకారం అందించారు- సబ్ కలెక్టర్  కల్పన కుమారి

0 36

నంద్యాల ముచ్చట్లు :

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి  బదిలీ సందర్భంగా  మర్యాదపూర్వకంగా అధికారులు మరియు  కార్యాలయ సిబ్బంది అభినందించారు.శనివారం నంద్యాల  సబ్ కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి  విశాఖపట్నం జాయింట్ కలెక్టర్( హౌసింగ్) గా బదిలీ అయిన సందర్భంగా  సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరనాధ రావు .డి వై ఎస్ ఓ అలీపిరా.  తదితరులు అభినందనలు తెలియజేశారు  నంద్యాల సబ్ కలెక్టర్ 2020 ఆగస్టు నెల నుండి   ఈ పది నెలల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించారని అన్నారు.సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ శుక్రవారం రోజు రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె అన్నారు 20 20 ఆగస్టులో నంద్యాల సబ్ కలెక్టర్ గా  ప్రభుత్వం నియమించిందని  ఐఏఎస్ అనంతరం తొలి పోస్టింగ్ నంద్యాలలో నేనని అన్నారు. రెండో పర్యాయం  విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్ )గా  ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆమె అన్నారు. రెవెన్యూ డివిజన్ లో విధులు నిర్వహించిన సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అందరూ మంచి సహకారం అందించారని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సీసీ లు మధు. యాసీన్ భాష. సిబ్బంది  ఫకీర్ మహమ్మద్. మంజూరు హుస్సేన్. సురేంద్ర. రామ సంజీవరావు. గురు స్వామి. శ్రీనివాసులు. కామేశ్వరి రెడ్డి. శ్వేత. కరుణమ్మ. నాగ అశోక్. అన్నపూర్ణమ్మ. అబ్దుల్ ఖాదర్. పెద్దన్న. రషనిత. శివ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Revenue staff in the division provided good assistance- Sub Collector Kalpana Kumari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page