తాగునీరు సమస్య లేకుండా చేస్తాం.

0 28

జూలూరుపాడు   ముచ్చట్లు :
తాట్కూరు గోమ్ము పంచాయితీ  పరిధిలోని ఏ గ్రామంలో కూడా మంచి నీటి కొరకు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కామినేని వేంకటేశ్వరరావు అన్నారు. హాస్పటల్ కాలనీ నివసిస్తున్న ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆ కాలనిలో కొత్త మోటర్ ఏర్పాటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పంచాయితీ  పరిధిలో ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో నిరంతరం కొత్త బోర్లు,మోటర్ రిపేర్లు చేస్తూ  ఎక్కడ కూడా ప్రజలు నీటి కొరకు కష్టాలు లేకుండా చేస్తున్నామని, అదే విధంగా పంచాయతీ పరిధిలోని అయా గ్రామాలలో ఎమైన సమస్యలు ఉన్నా సర్పంచ్ లేదా తమ దృష్టికి తీసుకు వస్తే సాధ్యమైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించ డానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని ఆకండ మెజార్టీ తో గెలిపించిన ప్రజలకు ఈ విధంగా వారికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆనందంగా  ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నాటి .రాజ ,యూత్ నాయకులు బద్దె.ప్రేమ్ కుమార్,వార్డు సభ్యులు పొసరపు.మాధవి,వలపార్ల.శోభ రాణి తదితరులు హాజరయ్యారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Drinking water will do without problem.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page