తాడిపత్రిలో భారీ వర్షం

0 27

అనంతపురం  ముచ్చట్లు :

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం, మండల వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రహదారులు, పలు కాలనీలు జలమయమయ్యాయి.. పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న పెద్ద వృక్షాలు నేలకొరిగాయి.. అంబేడ్కర్నగర్, మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో వర్షపు నీరు మురుగు నీరుతో కలిసి రహదారులపై పారుతోంది. పురపాలిక సిబ్బంది మార్గబిలాలను శుభ్రం చేసి వర్షం నీరు నిల్వ లేకుండా చేస్తున్నారు.. తాడిపత్రి మండలంలోని యళ్లనురు రోడ్డు వద్ద ఉన్న వంక ఉదృతంగా ప్రవహిస్తోంది. కడప రహదారిలో నూతనంగా నిర్మించిన 500 పడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభించాల్సి ఉండగా ఆసుపత్రి అవరణం అంతా కూడా వర్షపు నీరు చేరింది.. తాడిపత్రిలో 37.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Heavy rain in Tadipati

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page