దర్శకులకు, రచయితలకు, నటులకు నిత్యావసరాలను అందించిన జీవన్ కుమార్…

0 28

సినిమా ముచ్చట్లు:

కరోనా విపత్కరకాలంలో సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ కష్టకాలంలో దర్శకుల సంఘం, రచయితల సంఘంలోని రెండు వందల సభ్యులకు , మా అసోసియేషన్ లోని వంద మంది సభ్యులకు నిత్యావసరాలను అందించారు నటుడు జీవన్ కుమార్. కరోనా విజృంభణ మొదలయినప్పటినుండి నటుడు జీవన్ కుమార్ నిత్యావసరాల పంపిణీ నుండి రోజూ వెయ్యిమందికి పైగా భోజనాలను అందించే ఏర్పాటులు చేసారు. ఇప్పడు సెకండె వేవ్ మొదలయినప్పటినుండి రోజుకు 300 కి పైగా కరోనా పేషెంట్స్ కి పోషక విలువలున్న భోజనం అందించారు. ఇవే కాకుండా కొత్తగూడెం, భద్రాద్రి పరిసర ప్రాంతాలలో ఉన్న గిరిజిన గ్రామాలకు 10 వేల కేజీల బియ్యం సరఫరా చేసారు. నిర్మల్ జిల్లా లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో నిత్యావసరాలు, మాస్క్ లను పంపిణీ చేసారు. జీవన్ కుమార్ చేస్తున్న సహాయక చర్యలకు ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను కొనసాగించేందుకు తొడ్పాటునందిస్తున్నారు. హీరో సాయిదరమ్ తేజ్ జీవన్ చేస్తున్న సహాయక చర్యలకు అండగా నిలిచారు.  ఈ రోజు దర్శకులు సంఘంలోని ఔత్సాహిక దర్శకులకు, రచయితలకు, మా అసోసియేషన్ లో మెంబర్స్ కి నిత్యావసరాలను అందించారు. ఈ సహాయక చర్యలపై నటుడు దర్శకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ: నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా గొప్పది. కరోనా కష్టకాలంలో పోలీసులు, డాక్టర్స్, పారిశ్రామిక కార్యకర్తలతో పాటు జీవన్ కుమార్ వంటి దాతలు చేస్తున్న సాయం చాలా మంది జీవనం సాగించేందుకు సహాయ పడుతుంది. ఆయన చేస్తున్న సేవలు చాలామందికి ధైర్యాన్ని నింపుతున్నాయి. ఇప్పడు నిత్యావసరాలను అందుకున్న ప్రతి సభ్యుడు కుటుంబంలో జీవన్ కుమార్ ఒక సభ్యుడయ్యాడు.  అన్నారు.
నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ నా స్నేహితుడు నాగార్జున  ద్వారా కాశీ విశ్వనాథ్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.  నేను చేస్తున్న సహాయం కు అండగా నిలిచిన హీరో సాయి ధరమ్ తేజ్ కి నేను థ్యాంక్స్  బుతున్నాను. నేను చేస్తున్న సహాయక చర్యలకు అండగా నిలిచినందుకు అండగా నిలిచిన హీరో నవీన్ కు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కి చాలా థాంక్స్..నాకు వచ్చిన రిక్వెస్ట్ ల ప్రకారం సహాయం చేసుకుంటూ వచ్చాను. ఈ నెలన్నర రోజుల నుండి చాలామందికి
సహాయం అందివ్వగలిగాను. అలాగే  కొన్ని ఎన్ జీ వో లకు కూడా సహాయం అందించాం..  నేను చేస్తున్న సహాయక చర్యలకు అండగా నిలుస్తున్న సినిమా పరిశ్రమలోని పెద్దలకు, దాతలకు మనస్ఫూర్తిగా దన్యావాదాలు తెలుపుతున్నాను.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Jeevan Kumar, who provided essentials for directors, writers and actors …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page