దేశ సేవలనుంచి నిష్క్రమించిన నౌక సంధాయక్

0 20

విశాఖపట్నం   ముచ్చట్లు :
40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ ఐఎన్ఎస్ సంధాయక్ ఇక సెలవంటూ నిష్క్రమించింది.సర్వే మిషన్లు మాత్రమే కాకుండా, ఆపరేషన్ పవన్ – 1987 లో శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళానికి సహాయం చేయడం, ఆపరేషన్ సరోంగ్, ఆపరేషన్ రెయిన్బో – 2004 లో సునామి తరువాత మానవతా సహాయం అందించడం.. తొలిసారిగా పాల్గొనడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలలో ఈ నౌక చురుకుగా పాల్గొంది.టైగర్-ట్రయంఫ్ పేరుతో ఇండో-అమెరికా ఉమ్మడి నౌకా విన్యాసంలో కూడా ఈ నౌక పాల్గొంది. ఈఎన్ సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్- ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహ దూర్ సింగ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ సమక్షంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.1981 ఫిబ్రవరి 26న ఈ నౌకను విశాఖలోనే భారత నౌకాదళంలో ప్రవేశ పెట్టారు. 40 ఏళ్ల వ్యవధిలో 200 పెద్ద హైడ్రో గ్రాఫిక్ సర్వేలను.. లెక్కలేనన్ని చిన్నపాటి సర్వేలను ఈ నౌక చేసింది. తూర్పు, పశ్చిమ తీరాలలో సముద్ర జలాల్లోనే కాకుండా అండమాన్ దీవులలో కూడా ఇది సర్వేలను చేపట్టింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Sandhayak, a ship leaving the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page