నిర్లక్ష్యం చేస్తే నీకే నష్టం మలేరియా సబ్ డివిజన్ ఆఫీసర్ ఆస్పరి సాయిబాబా

0 30

పత్తికొండ  ముచ్చట్లు :

కరోనా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో నిర్లక్ష్యం చేయకుండా అందరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని లేదంటే తీవ్రంగా నష్టపోతామని మలేరియా సబ్ డివిజన్ ఆఫీసర్ ఆస్పరి సాయిబాబా అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తుగ్గలి మద్దికెర మండలంలోని గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ ఇస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోకపోతే తీవ్రమైన వ్యాధులు సోకుతాయి అని చెప్పారు. మద్దికేర మండలంలోని బొమ్మనపల్లి గ్రామం లో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేశామన్నారు. జూన్ నెలలో దోమలు తీవ్రంగా ఉండటం వల్ల మలేరియా జ్వరాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఈ సమయంలో దోమలు అధికంగా ఉంటే గ్రామ సర్పంచులు కార్యదర్శులు తగిన శ్రద్ధ వహిస్తే మెటీరియల్ సరఫరా చేస్తామన్నారు. పదిరోజుల్లో తుగ్గలి మండలం లోని చెన్నంపల్లి, రామలింగయ్యపల్లి, తుగ్గలి, శంకరబండ గ్రామాల్లో డిడిటి మందు పిచికారీ చేస్థామన్నారు. గతేడాది తీవ్ర ఇబ్బందులు పడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్లీచింగ్ పౌడర్ ను ఇంటింటికి వెళ్లి పిచికారి చేస్తున్నామని తెలిపారు. కార్యదర్శులు , సర్పంచులు ఆసక్తి కలిగిన వారు ఉంటే క్రిమి,కీటకాలు పారద్రోలేందుకు మెటీరియల్ అందజేస్తామన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Loss to yourself if neglected
Malaria Sub Division Officer Aspari Saibaba

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page