నెల రోజుల్లోనే  కుటుంబ పెన్షన్ అందించాలి.  

0 33

జగిత్యాల ముచ్చట్లు :

 

ఉద్యోగి మరణిస్తే ..కుటుంబ పెన్షన్ చెల్లింపులు వేగవంతం గా అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలను  ఆదేశించిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా సంఘం కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల నుంచి క్లయిం వచ్చిన నెల రోజుల్లోపే కుటుంబ పెన్షన్ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ మేరకు జాతీయ పెన్షన్ వ్యవస్థ  కిందకు వచ్చే  ఉద్యోగులకు సంబంధించి  సూచనలు విడుదల చేసింది. కుటుంబ  ఎన్ పి ఎస్ పెన్షన్ కార్పస్ లోని ఉద్యోగుల కాంట్రీబ్యూషన్లు  ,వాటిపై వచ్చే రిటర్న్ లను కూడా కుటుంబ సభ్యులకు సత్వరం అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని  ,2020 జనవరి 1 నుంచి మరణించిన కేంద్ర ప్రభుత్వ   శాఖల ఉద్యోగుల వివరాలు,వారికి పీపీవో జారీ,కుటుంబ పెన్షన్ జారీ ,ఇతరత్రా చెల్లింపుల వివరాలను  నెలవారిగా పంపించాలని అన్ని శాఖాలను  కేంద్రప్రభుత్వం కోరిందని హరి ఆశోక్ కుమార్ తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, మహిళా కార్యదర్శి బి.కరుణ,ఆలిశెట్టి ఈశ్వరయ్య, విద్యాసాగర్,యాకుబ్,నర్సయ్య,సత్యనారాయణ, ప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Vande Bharat Mission begins

 

Tags: The family pension should be paid within a month.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page