నేరాలను అరికట్టడంలో సీసీకెమెరాలు ఎంతగానో దోహదం: డీజీపీ

0 22

హైదరాబాద్‌ముచ్చట్లు :

 

నేరాలను అరికట్టడంలో సీసీకెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీలో 6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. శనివారం ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. పోలీస్‌ శాఖకు తెలంగాణ ప్రభుత్వం తగిన కేటాయింపులు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత పోలీస్‌ శాఖలో మార్పులను స్పష్టంగా గమనించొచ్చని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో పోలీస్‌ శాఖలో ఎన్నో మార్పులు తెచ్చామని డీజీపీ గుర్తుచేశారు.. నేరాలు అరికట్టడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఆధునాతన సౌకర్యాలతో పోలీస్‌ స్టేషన్‌ భవనాలు నిర్మిస్తున్నామని, పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచ్చామని డీజీపీ పేర్కొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:How much CCTV cameras contribute to crime prevention: DGP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page