పుంగనూరులో ఉపాధ్యాయుల కుటుంభాలను ఆదుకుంటాం- ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

0 123

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా వ్యాధితో భాదపడి మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంభాలను అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హామి ఇచ్చారు. శనివారం ఆయన పట్టణంలో పర్యటించారు. మృతి చెందిన ఉపాధ్యాయులు నాగమల్లు, శివకుమార్‌, శరత్‌బాబు ల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రభుత్వపరంగా అందాల్సిన డబ్బులు తక్షణమే విడుదల చేయిస్తామన్నారు. అలాగే ఉపాధ్యాయుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు జాగ్రత్తగా కరోనా నియంత్రణ పద్దతులు పాటించాలని, ఈ విషయమై పలువురుని చైతన్యవంతులు చేయాలని సూచించారు. ఈయన వెంట ఎస్టీయు నాయకులు భాస్కర్‌, మురళి, కిషోర్‌కుమార్‌రెడ్డి, అయూబ్‌ఖాన్‌, మోహన్‌, లింగయ్య, గోపాల్‌, రెడ్డెప్ప, బుడ్డన్న, అనిల్‌కుమార్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Let’s support the families of teachers in Punganur- MLC Katti Narasimhareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page