పుంగనూరులో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలి

0 82

పుంగనూరు ముచ్చట్లు:

 

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం మున్సిపాలిటిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఫారెస్ట్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులతో కలసి నిర్వహించి , మొక్కలు పంపిణీ చేసి నాటారు. అలాగే ఆర్టీసి డిపోలో మేనేజర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో కార్మిక సంఘ నాయకులు కరీముల్లా, చంద్ర కలసి మొక్కలు నాటారు. చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటించి, హరిత పుంగనూరుగా మార్చుతున్నామన్నారు. అలాగే మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నటరాజ, జెపి.యాదవ్‌, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, ఎన్విరాల్‌మెంటల్‌ ఇంజనీర్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Everyone should be involved in environmental protection in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page