పుంగనూరులో రూ.50 లక్షలు విలువ చేసే ఎండోమెంట్‌ స్థలం స్వాధీనం

0 342

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని తూర్పువెహోగశాల వద్ద గల జాతీయ రహదారిపై గల శ్రీమహంతు మఠానికి చెందిన రూ.50 లక్షలు విలువ చేసే స్థలాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకాంబరం స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుతో కలసి సర్వేనెంబరు:241/1లో గల 7 సెంట్ల భూమిలో ఆక్రమణదారులు రేకులషెడ్లు వేసుకుని ఉన్నారు. దీనిపై ట్రిబ్యునల్‌కోర్టు ఉత్తర్వుల ప్రకారం దేవాదాయశాఖ రేకులషెడ్లను తొలగించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలాన్ని దురాక్రమణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏకాంబరం హెచ్చరించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Endowment land worth Rs 50 lakh seized in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page