ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటుదాం కాలుష్యాన్ని తగ్గిస్తాము

0 15

*డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి
నగరపాలక ఆధ్వర్యంలో పదివేల చెట్లు

తిరుపతి ముచ్చట్లు :

- Advertisement -

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శనివారం ఉదయం కరకంబాడి రోడ్డు వద్ద ఉన్న గెస్ట్ లైన్ డేస్ హోటల్ సమీపంలో ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఇరువైపులా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున 10 వేల మొక్కలు,  చెట్టు నాటే కార్యక్రమకు శ్రీకారం చుట్టారు.  ప్రజా ప్రతినిధులు, నగరపాలక కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు మరియు తిరుమల, తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగర పాలక ఆధ్వర్యంలో పదివేల చెట్లు 🌲 మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టాడం చాలా, చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం మంచిదని, ఈ చెట్లు భావితరాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని, ప్రతి ఒక్కరు ఒక చెట్లు నాటితే భవిష్యత్తు తరాల వారికి మంచి ఉపయోగం ఉంటుందని తెలియజేశారు.

ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరపాలక కమిషనర్, మేయర్ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టడం శుభపరిణామం, స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ లేకుండా పోయిందని, పచ్చదనానికి ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున దాదాపు 50 వేల మొక్కలు నాటుతున్నమని, ఇప్పుడు నాటుతున్న చెట్లు వ్యాపా, రాగి మంచి మంచి చెట్లు నాటుతున్నం, ఒక చెట్టు 100 సంవత్సరాలు ఉండేవిధంగా మంచి చెట్లు నాటుతున్నంఅని ఈ సందర్భంగా తెలియజేశారు.

కమిషనర్ గిరీష మాట్లాడుతూ పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష చెట్టు నాటే విధానం గా ఏర్పాటు చేస్తామని నేడు 10,000 మొక్కలు నాటేందుకు నగరపాలక శ్రీకారం చుట్టారు జరిగిందని, నగరమంతా చెట్టు నాటే పక్రియ మెదలు పెట్టడం జరిగిందని, నగరంలో కాలుష్యం నియంత్రణ, నీడనిచ్చే చెట్లు ని ఏర్పాటు చేస్తున్నామని కొత్తగా ఏర్పాటు అయిన మాస్టర్ ప్లాన్ రోడ్లో రెండు వేల చెట్లు 🌲 మొక్కలు నాటడం జరిగింది అని అదేవిధంగా కొర్లగుంట డి.బి.ఆర్ హాస్పిటల్ రోడ్డులో ఇరువైపుల రెండు వేల చెట్లు, ఉపాధ్యాయ నగర్ రెండువేల చెట్లు, గోపాల్ హౌసింగ్ కాలనీ వద్ద రెండువేల చెట్లు మరియు జీవకోన, కరకంబాడి రోడ్డు, గొల్లవాని గుంట నుండి రేణిగుంట రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

మేయర్ శిరీష, ఎంపీ గురుమూర్తి మరియు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, వాటిద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని నేడు మాస్టర్ ప్లాన్ రోడ్డు మరియు మధుర ప్రాంతాలలో చెట్లు నాటడం జరిగిందని పర్యావరణ విఘాతం కలిగించే అనేక మానవ తప్పిదాల లో కాలుష్యాన్ని కలిగించే వస్తువులు వాడకం ముఖ్యంగా ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుందని అందులకు కు నగరంలో ప్లాస్టిక్ నిషేధించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకొని ఒక చెట్టు ఇంటి ముందర నాటాలని, చెట్టు పెంచడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఒక చెట్టు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల, తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డా. జవహర్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, నగర పాలక మేయర్ శిరీష, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, నగరపాలక కమిషనర్ గిరీష, ఉప మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, నగరపాలక అదనపు కమిషన్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్ రామ్ రెడ్డి ,డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Let’s plant a plant for everyone
We will reduce pollution

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page