బోయకొండ ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు మృతి- విషాదంలో భక్తజనం

0 645

– బ్లాక్‌ ఫంగస్‌కు గురై మృతి చెందిన ఆచార్యులు

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

చౌడేపల్లె మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న కెవి.లక్ష్మణాచార్యులు(52) బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి గురై, చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత నెలలో కరోనా భారీన పడిన లక్ష్మణాచార్యులు చికిత్స పొందుతూ కొలుకున్నారు. ఈ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైకు తరలించారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.అంత్యక్రియలు చౌడేపల్లెలో నిర్వహించారు.

 

 

అజాత శత్రువుగా….

శ్రీబోయకొండలో ప్రధాన అర్చకులుగా ఉన్న లక్ష్మణాచార్యులు అందరితోను కలయగలుపుగా ఉంటు అజాత శత్రువుగా అందరిని ఆకట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మరణవార్త విని భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పలువురు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

 

 

 

హనుమత్‌ జయంతి రోజు…

చౌడేపల్లె శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో గత 40 సంవత్సరాలుగా అక్కడే ఉంటు ఆంజయనేయస్వామి ఆలయంలో నిత్య పూజలు నిర్వహించే లక్ష్మణాచార్యులు హనుమత్‌ జయంతి రోజునే మృతి చెందడం పలువురిని కలచివేసింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Boyakonda temple priests Lakshmanacharya killed- Devotees in tragedy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page