మళ్లీ ప్రమణా రాజకీయాలు

0 8

గుంటూరుముచ్చట్లు :

ఏపీలో ప్ర‌మాణాల రాజ‌కీయాలు కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు కూడా వైసీపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య‌లో పెద్ద ఎత్తున దుమారం రేపింది ఈ ప్ర‌మాణాలే. అయితే ఇలాంటివి మానుకోవాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు అప్ప‌ట్లో వైసీపీ, టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. అయితే అప్ప‌ట్లో ఇవి కాస్త త‌గ్గిన‌ట్టే క‌నిపించినా.. ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాయి. దీంతో మ‌ళ్లీ రాజ‌కీయాలు రాజుకుంటున్నాయి.గుంటూరులోని వినుకొండ‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు ఫౌండేష‌న్ సంస్థ‌కు ఎన్ ఆర్ ఐల నుంచి నిధులు వ‌స్తున్నాయంటూ ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఆరోపించారు.దీంతో జీవీ ఆంజ‌నేయులు కోట‌ప్ప‌కొండ‌పై ప్ర‌మాణానికి సిద్ధ‌మ‌య్యారు. ద‌మ్ముంటే అక్క‌డ‌కు వ‌చ్చి ప్రమాణం చేయాలంటూ స‌వాల్ విసిరారు. దీంతో బొల్లా స్పందిస్తూ ప్ర‌మాణాలు వ‌ద్ద‌ని, బ్యాంకు బ్యాల‌న్స్ షీటుతో వ‌స్తే చ‌ర్చిద్దామంటూ చెప్పారు. కానీ దీనిపై జీవీ రిప్లై ఇవ్వ‌లేదు. కానీ ఆయ‌న అనుచ‌రులు మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. దీంతో పోలీసులు జీవీ ఇంటివ‌ద్ద భారీగా మోహ‌రించారు. ఎటూ వెళ్లొద్దంటూ ఆయ‌న్ను నిలువ‌రిస్తున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Standard politics again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page