రైతుల మరణాలు దేశానికే అరిష్టం సీపీఐ

0 12

నంద్యాల ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల బలిదానాలను ఖండించండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల డిమాండ్.
స్థానిక సాయిబాబా నగర్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల  చట్టాలను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతులను దగ్ధం చేయడం జరిగిందన్నారు .
ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్  ఏ ఐ టి యు సి అధ్యక్షులు డి శ్రీనివాసులు  పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక రైతు లేనిదే దేశం లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల చేతులకు సంకెళ్లు వేసి వారి మీద కుట్రపూరితమైన కేసులు బనాయించడం జరిగిందని అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమములో 500 మంది రైతులు మరణించడం జరిగిందని మండిపడ్డారు.
లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతుంటే దొడ్డిదారిన కొత్త కొత్త చట్టాలను తీసుకు వస్తున్నారని తెలిపారు. పార్లమెంటులో రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలను రద్దు చేయాలని గ్రామగ్రామాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సమావేశాలతో కాలయాపన చేస్తోందని అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం అని వ్యవసాయాన్ని పండుగ చేద్దామని చెప్పుకొని ఈ ప్రభుత్వం కూడా పార్లమెంటులో నల్ల చట్టాలకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్రంలో మాత్రం మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు 23 మంది ఎంపీలు ఉంటే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలో రైతాంగాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే వరకు ఎంపీల చేత తీర్మానం చేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు గ్రామగ్రామాన కూడా రైతులతో మమేకమై రాబోయే దినములలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో లో ఏ ఐ వై ఎఫ్ అధ్యక్షుడు చైతన్య భవన నిర్మాణ సహాయ కార్యదర్శి భాష రైతులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The deaths of farmers are unfortunate for the country
CPI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page