వేములదీవి స.హ బ్యాంకు అధ్యక్షుడు ఆరెస్టు

0 16

ఏలూరు  ముచ్చట్లు :
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లోని  ది వేములదీవి ప్రాధమిక వ్యవసాయ మ్యూచవల్లీ ఎయిడడ్ కో ఆపరేటివ్ సొసైటీ  లిమిటెడ్ (మాక్స్ సొసైటీ ) లో 83 లక్షలు అవకతవకలకు పాల్పడిన సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ ను పోలీసులు అరెస్ట్ చేసారు .రైతులకు ప్రభుత్వం నుండి వచ్చిన రాయితీలను తప్పుడు లెక్కలు చూపి కాజేయడం తో పాటు ,సొసైటీ జరిగిన అవకతవకలు పై రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా సొసైటీ అధికారులు ఎంక్వయిరీ చేసి సొసైటీ లో 83 లక్షలు అవక తవకలు  జరిగిందని సొసైటీ అధ్యక్షుడు మీకెలా సత్యనారాయణ,సొసైటీ గుమస్తా కంచర్ల బాబ్జి ల పై కేసు నమోదు చేయమని పోలీసులకు డైరక్షన్ ఇవ్వడం తో పోలీసులు సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ , గుమస్తా కంచర్ల బాబ్జి లను 420, 406,408,409,465,471,సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు . దీనిలో మరికొందరు డైరెక్టర్ల పాత్ర ఉందని విచారణ చేసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని నరసాపురం రూరల్ ఎస్సై తెలిపారు
రైతులకు రావలసిన రాయితీలు కాజేయడం తో పాటు తప్పుడు లెక్కలు చూపి సొసైటీ డబ్బును   అనేక సంవత్సరాల నుండి కాజేస్తున్నారని అంతే కాక కుటుంబం లోని వారి పేరు మీద  డిపాజిట్లు చూపి వాటికి అధిక వడ్డీలు  లెక్కలు చూపించి రైతులకు రావలసిన లాభలను కూడా కాజేశారని రైతులు వాపోతున్నారు . దీనిమ్పి ఫిర్యాదు చేయడం తో జిల్లా సొసైటీ అధికారులు ఎంక్వయిరీ చేసి కేసు నమోదు చేసారని రైతులు తెలిపారు  .

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Arrest of Vemuladevi Co-operative Bank President

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page