సింధుశ్రీ కేసు ప్రియుడే… హంతకుడు

0 20

విశాఖపట్టణం  ముచ్చట్లు :
విశాఖ నగరంలో కలకలం రేపిన మూడేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. చిన్నారి తల్లితో సహజీవనం చేస్తున్న జగదీష్ తన సుఖానికి అడ్డొస్తుందన్న కారణంతోనే పాపను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నగరంలోని మారీక వలసకు చెందిన బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్యాభర్తలు. ఐదేళ్ల కిందట పెళ్లైన దంపతులకు మూడేళ్ల కూతురు సింధు ఉంది. రమేష్ తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో బోర జగదీష్ రెడ్డి అనే వ్యక్తితో వరలక్ష్మికి పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది.వరలక్ష్మి భర్త కళ్లుగప్పి జగదీశ్‌తో తరుచూ రాసలీలలు కొనసాగించేది. జగదీశ్‌కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. గత మార్చి 14న వరలక్ష్మి భర్తను వదిలేసి ప్రియుడు జగదీశ్‌తో వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత తిరిగిరాగా… మే 14 వరలక్ష్మి, ఆమె కూతురు సింధును జగదీశ్‌ మళ్లీ తీసుకుపోయాడు. నాలుగు రోజుల క్రితం భర్తకు ఫోన్ చేసిన వరలక్ష్మి కూతురు చనిపోయిందని చెప్పింది. దీంతో అతడి ఫిర్యాదుతో పోలీసులు వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే పాపను మూడు రోజుల క్రితం అర్ధరాత్రి శ్మశానంలో పూడ్చిపెట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసులు పాప మృతదేహాన్ని వెలికితీసి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు.అయితే చిన్నారిని కన్నతల్లే హతమార్చిందని అందరూ అనుకోగా.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెల్లడైంది. వరలక్ష్మితో అక్రమ సంబంధం కొనసాగించేందుకు అడ్డొస్తుందన్న ఆక్రోశంతో జగదీశే చిన్నారిని చంపినట్లు తేలింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని తీవ్రంగా కొట్టి చంపేసిన అతడు.. ప్రియురాలి సాయంతో శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అయితే కన్నబిడ్డను చంపినా వరలక్ష్మి ఎందుకు మౌనంగా ఉందనేది చర్చనీయాంశంగా ఉంది. చిన్నారిని హత్య చేసేందుకు ఆమె కూడా సాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Sindhushree case
Priyude … the killer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page