సిక్కోలులో  వాహానమిత్ర టాప్

0 47

శ్రీకాకుళం    ముచ్చట్లు :

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి సంబంధించిన  రిజిస్ట్రేషన్లలో శ్రీకాకుళం జిల్లా ముందంజలో నిలిచింది. అధికారులు, సిబ్బంది చొరవ తీసుకుని నమోదు చేయించడంతో గత ఏడాదితో   పోల్చితే ఈ ఏడాది కొత్తగా 1434 మందికి ఈ పథ కం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆటో, టాక్సీలు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇన్సూరెన్స్‌లు, టాక్స్‌లు, మరమ్మతులు నిమి త్తం ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి  లబ్దిదారుల ఖాతాలో వాహనమిత్ర సొమ్ము జమ చేయనున్నారు. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాహనమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవడం చాలామంది డ్రైవర్లకు సులభతరంగా మారింది. ఎన్ని పనులు ఉన్నప్పటికీ గ్రామ సె క్రటరీకు దర ఖాస్తు ఇవ్వడంతో పాటు ఆయన దగ్గరుండీ వా హనాన్ని పరిశీలించడం, వెంటవెంటనే ఆన్‌లైన్‌ చేయడంతో ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది.  2019 అక్టోబర్‌లో ప్రారంభించిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఎంతో మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చింది. ఈ పథకానికి గతేడాది 13,735 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 13,539 మందికి రూ.10వేలు ప్రోత్సా హకం లభించింది. గతేడాదిలో రెన్యువల్స్, ఈఏడాదిలో కొత్తగా  దరఖాస్తు చేసిన లబ్దిదారులు కలిపి 14,973 మందితో జాబితా ఖరారయ్యింది.  రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కంటే శ్రీకాకుళంలోనే అత్యధికంగా రిజి్రస్టేషన్లు కావడం విశేషం. జిల్లాలో క్యాబ్స్, ఆటోలు కలిపి 30,804 వరకు ఉన్నాయి. నాకు సొంత ఆటో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో గతేడాది దరఖా స్తు చేయలేకపోయాను. ఈసారి ఆర్టీవో అధికారులు మార్గమధ్యలో తనిఖీలు చేస్తూ వా హనమిత్రకు దరఖాస్తుపై ఆరా తీశా రు. మా గ్రామంలో సచివాలయ సిబ్బంది ద్వారా వాహనమిత్రకు దరఖాస్తు చేశాను.  ఏడాది పూర్తికాకుండానే రెండోసారి రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి టాక్సీ డ్రైవర్‌ అకౌంట్‌లో రూ.10వేలు వేయడం గొప్ప నిర్ణయం.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Vehicle friendly top in Sikkim

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page