11 తర్వాత రాజీనామా

0 16

హైదరాబాద్   ముచ్చట్లు :

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్‌లో కీలకనేత స్థాయికి ఎదిగినఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్‌తో బంధానికి స్వస్తి పలికారు. ఈ క్రమంలో ఇవాళ ఈటల తన రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉంది. అయితే .. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు తన రాజీనామా లేఖను ఇవాళ స్పీకర్ కు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన రాజీనామా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ నెల 11వ తేదీ తర్వాత ఈటల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతారని అంటున్నారు. ఈటలతో పాటు మరికొందరు ఉద్యమ నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.మరోవైపు శుక్రవారం పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఈటల.. సంచలన వ్యాఖ్యలు చేశారు. . టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి, తనకు ఐదేళ్ల నుంచే విబేధాలు నెలకొన్నాయని ఈటల రాజేందర్‌ వివరించారు. దళిత సీఎం సంగతి ఏమో గానీ సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఐఏఎస్‌ అధికారులు ఒక్కరైనా ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారం కావని ఈటల అన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Resigned after 11

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page