కరీంనగర్ టూర్ కు కేసీఆర్

0 22

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. కరోనా కన్న పాలిటిక్స్ మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేయడంతో ఈటల ఇలాకాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఆయన కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ రాజీనామా, విమర్శలు, ఆరోపణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న వేళ కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ హుజూరాబాద్‌పై గులాబీ బాస్ మరింత ఫోకస్ పెడతారని సమాచారం.ఇప్పటికే హుజూరాబాద్‌లో కింది స్థాయి కార్యకర్తలు మొదలు టీఆర్ఎస్ నాయకులెవరూ జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ ఉపఎన్నిక ముగిసేవరకూ నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అధినేత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.దీంతో కరీంనగర్ పర్యటనలో… ఆపరేషన్ హుజూరాబాద్ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. హుజూరాబాద్‌ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా… ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా..పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈటల రాజీనామాతో కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:KCR to Karimnagar Tour

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page