45 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలి-నిజాముద్దీన్

0 9

తుగ్గలి ముచ్చట్లు :

 

45 సంవత్సరాలు ఉన్నవారందరు కోవిడ్ 19 టీకా మొదటి డోస్ తప్పక  వేసుకోవాలని తహసీల్దార్ నిజాముద్దీన్ పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన తుగ్గలి సచివాలయంలో కోవిడ్19
టీకా మొదటి డోస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరూ కోవిడ్19 టీకా వేసుకోవాలని తెలిపారు.టీకా పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని,స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎవరైనా టీకా పై తప్పుడు సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విఆర్వో నాగేంద్ర,పంచాయతీ కార్యదర్శి గోపాల్,వెల్ఫేర్ అసిస్టెంట్ పులిశేఖర్,డిజిటల్ అసిస్టెంట్ అశోక్, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: People over the age of 45 must be vaccinated – Nizamuddin

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page