కరోనా తో కుటుంబం బలి

0 39

చిత్తూరు ముచ్చట్లు :

 

సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని కరోనా కాటేసింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, బి. కొత్తకోట మండలం వేమిలేటికోట గ్రామం, దళితవాడకు చెందిన నామాల వెంకటరమణ(62) పోలీసు శాఖలో ఉద్యోగం చేసి పదవీవిరమణ చెందాడు. అనంతరం ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బుతో మదనపల్లి పట్టణం లోని పుంగనూరు రోడ్డు, డిఎస్పి బంగ్లా ఎదురుగా ఎన్ వి ఆర్ నగర్ లో స్థలాన్ని కొనుగోలు చేసి, ఇటీవల నూతన గృహం నిర్మించుకున్నాడు. భార్య లక్ష్మీదేవి(52) ఎంబీఏ పూర్తి చేసిన కుమారుడు రవీంద్ర (32) వైద్యరంగంలో డి ఫార్మసీ చేసిన కుమార్తె హేమా ల తో సుఖంగా జీవించేవాడు. కుమారుడు, కుమార్తెకు వివాహాలు చేసేందుకు సంబంధాలు చూస్తున్నాడు. ఈ తరుణంలో కరోనా పెను భూతంలా వచ్చింది. కరోనా వచ్చి కుమారుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో దిగులుపడిన వెంకటరమణ ఆరోగ్యం క్షీణించంతో మృతిచెందాడు. అప్పటికే కరోనా తో ఆస్పత్రిలో ఉన్న లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి చనిపోయింది. కుటుంబంలో వరుసగా ముగ్గరిని 15 రోజుల్లోనే మహమ్మారి కరోనా కాటేసి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. తల్లి,తండ్రి, సోదరుని పోగొట్టుకున్న యువతి హేమ ఏకాకిగా మారింది.

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Family sacrifice with Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page