పుంగనూరు కోవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో ఉత్తమ సేవలు

0 100

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కలసి సుమారు రూ.2 కోట్లతో 80 ఆక్సిజన్‌ బెడ్లు, 6 వెంటిలేటర్లు, 50 ఆక్సిజన్‌ కాన్స్న్‌ట్రేటర్లు కొనుగోలు చేసి ఆసుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చారు. అలాగే 100 పడకలతో కోవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం వైద్యుల సంరక్షణలో కరోనా రోగులకు ట్రయోజన్‌ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆక్సిజన్‌, వెంటిలేటర్లను అమర్చి, వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్‌ ఆసుపత్రితో పాటు సదుం మండల కేంద్రంలో కూడ కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసి, పుంగనూరు నియోజకవర్గంలో కరోనా భారీన పడిన వారికి మాత్రమే సేవలు అందిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటి వరకు 16 మంది రోగులు చికిత్సలు పొందుతున్నారు. అలాగే కోవిడ్‌ కేంద్రంలో 81 మంది ఉన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల, కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, కమిషనర్‌ కెఎల్‌.వర్మ పర్యవేక్షణలో రోగులకు సేవలు అందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Best services in Punganur Kovid Government Gazette

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page