అదనపు కట్న వేధింపులతో ఆత్మహత్య

0 20

కడప ముచ్చట్లు :

 

అదనపు కట్నం వేధింపులు ఓ యువతిని బలి తీసుకున్నాయి.కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్‌ నాయక్‌ కడప ఎల్‌ఐసీ కార్యాలయంలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె లిఖిత (27) తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతుండగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నూన్‌సావత్‌ శ్రావణ్‌నాయక్‌కు ఇచ్చి 2017లో వివాహం చేశారు. వివాహ సమయంలో 50 తులాల బంగారం కట్నంగా ఇచ్చారుపెళ్లి తర్వాత శ్రావణ్‌కు ముంబయిలో పీజీ జనరల్ మెడిసిన్ చేసేందుకు సీటు రావడంతో భార్యతో కలిసి అక్కడే కాపురం పెట్టాడు. వీరికి 18 నెలల పాప ఉంది. ముంబయి వెళ్లిన కొద్దిరోజులకే శ్రావణ్‌లో చాలా మార్పు వచ్చింది. పుట్టింటి నుంచి రూ.50లక్షల అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించేవాడు. భర్త తీరుతో మనస్తాపం చెందిన లిఖిత గతంలో ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసింది.

 

 

 

- Advertisement -

ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లిఖితను పుట్టింటికి తీసుకొచ్చేశారు. ఫిబ్రవరి నుంచి ఆమె ప్రొద్దుటూరులోనే ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన శ్రావణ్‌ నాయక్‌ ప్రొద్దుటూరుకు వచ్చి అదనపు కట్నం కావాలని లిఖితను వేధించాడు.తాను కోరినంత కట్నం ఇస్తేనే లిఖితను కాపురానికి తీసుకెళ్తానని, లేకపోతో పుట్టింట్లోనే ఉంచుకోవాలని హెచ్చరించి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన లిఖిత మూడో తేదీన బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన అల్లుడు శ్రావణ్‌నాయక్‌, అతని తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖిత తండ్రి గంగాధర్‌ నాయక్‌ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Suicide with extra dowry harassment

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page