ఆపత్కాల సమయంలోనూ ఆగని సంక్షేమం

0 14

-ఆడపిల్లకు అపురూప కానుక కల్యాణలక్ష్మి
-నేరుగా ఇంటి వద్దకే వెళ్లి  చెక్ లను అందించిన మంత్రి జగదీష్ రెడ్డి
-పెన్ పహాడ్ మండలంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ చెక్ ల అందజేత
-21 మంది లబ్ధిదారులకు 21 లక్షల 2’216 చెక్ ల అందజేత

 

నల్గోండ ముచ్చట్లు :

 

- Advertisement -

పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. ఆ కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంభ పెద్దలా ఆలోచించి కల్యాణ లక్ష్మీ వంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. కల్యాణ లక్ష్మీ ..షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు.కరోనా కష్ట కాలం లో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా తెలంగాణా ఇంటి ఆడపడుచులు ఇబ్బంది పడకూడదని మేనమామ రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న వరం యిది అని ఆయన అన్నారు. కళ్యాణాలక్ష్మి/షాదీముభారక్ పధకం కింద ఎంపికైన  సూర్యాపేట నియోజకవర్గం లోని పెన్ పహాడ్ మండల పరిధిలోని  అనంతారం,పెన్ పహాడ్, మాచారాం  గ్రామాల లబ్ధిదారులకు  మంత్రి జగదీష్ రెడ్డి చెక్ లను పంపిణీ చేశారు.

 

 

 

 

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులందరిని ఒక్కదగ్గరకు చేర్చకుండా వినూత్నంగా మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి  లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి స్వయంగా వారి యిండ్లలోకి వెళ్లి చెక్ లు అందజేశారు.మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన ఈ వినూత్న ప్రక్రియ ముందుగా ఉహించనది కాకపోవడంతో మంత్రి జగదీష్ రెడ్డి ఒక్కసారిగా చెక్ పట్టుకుని నట్టింట్లో అడుగు పెట్టడంతో లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బైతున్న్నారు.  మండలపరిదిలోని 3 గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు 21 లక్షల 2016  రూపాయల చెక్ లను మంత్రి జగదీష్ రెడ్డి నేడు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎంపీపీ నెమ్మా ది బిక్షం, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ లు నాతాల జానికిరాం రెడ్డి, వెన్న సీతారాం రెడ్డి, తహసీల్దార్  శేషగిరి రావు, జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు మండాది నగేష్, మామిడి అంజయ్య, సూదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,  మిరియాల వెంకటేశ్వర్లు, గార్లపాటి  స్వర్ణ,పెద్దగట్టు దేవస్థాన కమిటీ మెంబర్ ఆవుల అంజయ్య యాదవ్, ఆనంతారం సర్పంచ్ బైరెడ్డి సంజీవ రెడ్డి,అనాజీపురం చెన్ను శ్రీనివాస్ రెడ్డి, దూపహాడ్ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు ,టి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Welfare that does not stop even in times of disaster

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page