ఆఫీసులోనే రాసలీలలు

0 91

హైదరాబాద్  ముచ్చట్లు :

 

చాటుమాటు ఎందుకనుకున్నాడో ఏమో.. ఏకంగా ఆఫీస్‌లోనే దుకాణం పెట్టేశాడో ఆఫీసర్. యువతితో రాసలీలలు సాగించాడు. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు. ఆ ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. తీరా అవి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో రాత్రికిరాత్రే పాపులర్ అయిపోయాడు. కార్యాలయంలోనే శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న వ్యవహారం బయటికి పొక్కడంతో సదరు అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆగ్రహం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు..జీహెచ్‌ఎంసీ పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న తిప్పర్తి యాదయ్య రాసలీలల వ్యవహారం కలకలం రేపుతోంది. తనకంటే చిన్నదైన యువతితో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అది కూడా కార్యాలయంలోనే కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫొటోలు యాదయ్య తన ఫోన్ తీసుకున్నవేనని.. తన గొప్పతనం చూపించుకోవడానికి ఆయనే ఫొటోలు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మాయిలను ట్రాప్ చేసి ఇలా ఫొటోలు, వీడియోలు వైరల్ చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Rasali in the office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page