ఉద్యోగ నియామకాల క్యాలెండర్ను విడుదల చేయాలి– డివైఎఫ్ఐ

0 21

కడప ముచ్చట్లు :

 

కడప నగరంలోని  డివైఎఫ్ఐ  ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక క్యాలెండర్ ను విడుదల చేయాలని *DYFI జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.స్థానిక జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటారు. పేపర్లో ప్రకటనలు యాడ్స్ పెద్ద పెద్ద అక్షరాల్లో ఇస్తారు కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ఏపీపీఎస్సీ క్యాలెండర్ 2 సంవత్సరాలు అయినా విడుదల చేయలేదు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన ఒక్క డీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ నోటిఫికేషన్ రాలేదని అలాగే ప్రతి సంవత్సరం ఖాళీ అయిన పోస్టుల వివరాలను మరియు రాష్ట్రంలో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ఎలాంటి చొరవ చేయలేదని అలాంటప్పుడు పేపర్లలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశామని గొప్పలు ఎందుకు చెప్పుకోవాలని వాటి ప్రచారానికి ఖర్చు పెట్టే బదులు నిరుద్యోగులకు భృతి ఇవ్వడం మంచిది అని తెలియజేశారు.

 

 

 

 

- Advertisement -

ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఎస్ఐ డీఎస్సీ గ్రూప్స్ అలాగే బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పుకునే ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా8 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గోడలకు పెయింట్ వేసినంత మాత్రాన విద్యార్థులకు చదువు సక్రమంగా అందదని వారికి చదువు చెప్పే ఉపాధ్యాయుల పెరిగినప్పుడు అది సాధ్యమవుతుందని తెలియజేశారు.ఇప్పటికే అనేకమార్లు జాబ్ క్యాలెండర్ విడుదల తేదీలను చెప్పి వాయిదాలు వేశారు అన్నారు.ఉగాదికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం అని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం నుండి ప్రకటననే విడుదల కాలేదు అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల సమస్యలను తీర్చాలని కోరారు.
సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముడియం.చిన్ని పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Calendar of recruitments should be released– DYFI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page