కాగజ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం–ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

0 9

కాగజ్ నగర్ ముచ్చట్లు :

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా   కాగజ్ నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్ & నాన్ వెజ్) భవన సముదాయ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప  భూమిపూజ చేశారు.ఈ మార్కెట్ భవన నిర్మాణంతో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రనతో పాటు ప్రజలకు అన్నీ ఒకే చోట లభ్యమయ్యే విధంగా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు..అన్ని సౌకర్యాలు హంగులతో మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు వ్యాపారస్తులకు అందుబాటులోకి తెస్తామని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు  మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరిష్, స్థానిక వార్డు కౌన్సిలర్ వనమాల విజయ-రాము, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The aim is to develop Kagaznagar town in all spheres – MLA Koneru Konappa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page