చింతమనేని ఫిర్యాదు

0 26

ఏలూరు ముచ్చట్లు :

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ , కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు . చింతమనేని , గన్ని వీరాంజనేయులు కలెక్టర్ , ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేసి విషయం వివరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొంతమంది గత సంవత్సర కాలంగా ఫేస్ బుక్ లో దెందులూరు పప్పు చింతమనేని అని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకరమైన  పోస్టులు పెడుతూ  అభిమానులు మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని. దెందులూరు పప్పు ఎవరు టైగర్ ఎవరు రాష్ట్ర ప్రజలకు తెలుసని ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోస్ట్ లు పెట్టడం మంచిదని హెచ్చరించారు. ఈ విషయం పై చర్యలు తీసుకోవాలని దెందులూరు si రామ్ కుమార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.

 

- Advertisement -

అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు  పలు సామాజిక మాధ్యమాల్లో కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలను , కించపరిచేలా పోస్టింగు పెడుతున్నారని , అటువంటి వారిపై చర్యలు తీసు కోవాలని  ఫేస్ బుక్ లో చింతమనేని మరణించినట్లుగా పోస్టింగ్ పెట్టారని , ఇది ఎంతో మంది  అభిమానులను కలచివేసిందన్నారు . ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు .ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్, దెందులూరు టిడిపి అధ్యక్షుడు  Y.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Complaint of concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page