చౌడేపల్లె మేజరు పంచాయతీ ఉపసర్పంచ్‌ శ్రీధర్‌బాబు మృతి

0 67

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక మేజరు పంచాయతీ ఉపసర్పంచ్‌ కడియాల శ్రీధర్‌బాబు(55) సోమవారం చికిత్సపొందుతూ బెంగళూరులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో మృతిచెందాడు. దివంగత మాజీ ఎమ్మెల్యే కెవి పతి పెద్దకుమారుడైన ఈఆయన గంగజారత కమిటీ సభ్యుడిగా, మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ అభివృద్ది కమిటీలో చురుగ్గా పాల్గొనేవాడు. గత నెల రోజుల క్రితం కోవిడ్‌ తో బాధపడుతూ వైదేహీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆదుకొనే శ్రీధర్‌బాబు మృతి పలువురిని కలిచివేసింది.మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఆయన మృతిపట్ల మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప,. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తోపాటు స్థానిక నేతలు సంతాపాన్ని తెలియజేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Choudepalle Major Panchayat Sub-Panch Sridharbabu died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page