నకిలీ తుపాకితో బెదిరించి కిడ్నాప్ చేయాలని చూశారు

0 6

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా మండలం బెడుసుపల్లి గ్రామానికి చెందిన పళ్లెం నారాయణ రెడ్డిని నకిలీ తుపాకితో బెదిరించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. బద్వేల్ కు చెందిన మండెం పవన్ కుమార్, కొలిశెట్టి పవన్ కుమార్ సోమవారం ఉదయం నారాయణ రెడ్డి ని అడ్డుకుని తుపాకీ చూపించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అటు వైపు పోలీసులు రావడం, నారాయణ రెడ్డి అరవడంతో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరినీ పట్టుకొని నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ తుపాకీ, కారు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Threatened with a fake gun and looked to be kidnapped

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page