పాపం.. చిరాగ్ పాశ్వాన్

0 9

పాట్నా ముచ్చట్లు :

 

తండ్రి మరణించిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేయాలని భావించిన చిరాగ్ పాశ్వాన్ ఆశలు నెరవేరేటట్లు కన్పించడం లేదు. చిరాగ్ పాశ్వాన్ ను ఇప్పుడు బీజేపీ కూడా పట్టించుకోవడం లేదు. రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్డీఏకు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. ఆయన ప్రతి కేబినెట్ లో మంత్రిగా ఉండేవారు. గత కేబినెట్ లో కూడా ఆయనకు మోదీ చోటు కల్పించారు. కానీ ఆయన మరణం తర్వాత చిరాగ్ పాశ్వాన్ వేసిన తప్పటడుగు రాజకీయంగా పార్టీకి ప్రమాదకరంగా మారింది.బీహార్ ఎన్నికల్లో లోక్ జన్ శక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ పై ఆగ్రహంతో చిరాగ్ పాశ్వాన్ బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. కేవలం జేడీయూ అభ్యర్థులున్న చోట ఆయన పోటీకి దిగారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించినా తాను బీజేపీికి విధేయుడేనని ప్రకటించుకున్నారు. ప్రచారంలో మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఎన్నికలలో జేడీయూ ను దెబ్బకొట్టిన చిరాగ్ పాశ్వాన్ తాను సాధించింది కూడా ఏమీ లేదులోక్ జన్ శక్తి పార్టీ కేవలం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక స్థానంలో విజయం సాధించింది. తన తండ్రి మంత్రి పదవిని ఇస్తారని చిరాగ్ పాశ్వాన్ ఆశలు పెట్టుకున్నారు.

 

 

 

- Advertisement -

అయితే తిరిగి ఎన్డీఏలో చిరాగ్ పాశ్వాన్ చేరేందుకు చేసిన ప్రయత్నాలను నితీష్ కుమార్ సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ఆయనను చేర్చుకోవడానికి వీలు లేదని బీజేపీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. బీజేపీ చిరాగ్ పాశ్వాన్ పట్ల కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది.దీంతో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక తన పార్టీ తరుపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా జేడీయూలో చేరి పోవడం చిరాగ్ పాశ్వాన్ కు దెబ్బేనని చెప్పాలి. బీజేపీ పెద్దలను కలసినా పెద్దగా ప్రయోజనం కన్పించడం లేదు. చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద తండ్రి రాజకీయ వారసత్వాన్ని సరైన ఎత్తుగడలు లేక చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sadly .. Chirag Pashwan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page