పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి- ఎం జి  పెట్రోల్ బంకు వద్ద నిరసన

0 24

ఎమ్మిగనూరు ముచ్చట్లు :

పట్టణంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా పెంచుతూ పోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం  డివిజన్ నాయకులు హనుమంతు బి రాముడు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంజి  పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేపట్టారు ఈ ఈ సందర్భంగా సిపిఎం నాయకులు  మాట్లాడుతూ  గత నెల రోజుల్లో ప్రభుత్వం 18 సార్లు పెట్రోలు, డీజిల్, ధరలు పెంచడం అమానుషమన్నారు. పెంచిన ధ‌ర‌ల ప్ర‌భావం నిత్యావసర సరుకులపై ప‌డింద‌న్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధ‌ర రూ.100 దాటింద‌న్నారు. క‌రోనాతో ప్ర‌జ‌లు ఓ వైపు అల్లాడుతుంటే మ‌రోవైపు ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌లు ఏమి కోన‌లేని తిన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌న్నారు.  కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలపై కక్షతో భారాలు మోపుతోందని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు, కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సింది పోయి వారిపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించేందుకు ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు, మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు  వసంత రాజు, కాలప్ప , రవి , శేషప్ప, వీరేంద్ర , వీర కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Petrol and diesel prices should be reduced- Protest at MG Petrol Bank

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page