పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం నిరసన

0 15

మచిలీపట్నం ముచ్చట్లు :

 

బుట్టయిపేట లోని జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రం వద్ద మరియురాజుపేట లలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం పార్టీ మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ నెల రోజుల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను 20 సార్లు పెంచింది .ఫలితంగా డీజిల్ పెట్రోల్ ధరలకు తేడా లేకుండా పోయింది ప్రజలు కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తుంటే ప్రజలపై కేంద్ర ప్రభుత్వo బరాలువేయటం సరైనది కాదు అని విమర్శించారు .డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు .అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన గాని రకరకాల టాక్స్లు వేసి ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధాకరం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కరోనా కాలం లో ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మచిలీపట్నం కార్యదర్శి చౌటపల్లి. రవి ,సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొడాలి .శర్మ ,కొల్లాటి .శ్రీనివాస్ ,మాదాల .వెంకటేశ్వరరావు ,సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బి .సుబ్రహ్మణ్యం ,సిహెచ్. జై రావు ,టీ .చంద్రపాల్ ,జి .కిషోర్ కుమార్, ఎం. పోలినాయుడు ,ఒడుగు.గంగాధర ప్రసాద్, కే .సుజాత ,రాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; CPM protests against hike in petrol, diesel and cooking gas prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page