పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి-గాంధీ భవన్ లో టీపీసీసీ సత్యాగ్రహం

0 7

హైదరాబాద్ ముచ్చట్లు :

 

గాంధీ భవన్ లో సత్యాగ్రహాన్ని  టీపీసీసీ అధ్యక్షు డు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభిపంచారు. ఈ కార్యక్రమంలో  ఎమ్యెల్సి జీవన్ రెడ్డి,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,  మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య,  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షులు శివ సేనా రెడ్డి, ఎన్యూఎస్సై  అధ్యక్షుడు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు పాల్గోన్నారు.ఉత్తమ్ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.

 

 

 

- Advertisement -

పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి. ఆరోగ్య శ్రీ లో కరోనో, బ్లాక్ ఫంగస్ చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు చేయాలి. రాష్ట్రంలో కరోనో ఒక భయంకర పరిస్థితులను కల్పించింది. ప్రభుత్వ  నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం వెంటనే కరోనో, బ్లాక్ ఫంగస్ కు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా సత్యాగ్రహం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని ఉత్తమ్ అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Free medical care for the poor – TPCC Satyagraha at Gandhi Bhavan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page