పేద కళాకారులకు దత్తపీఠం వాలంటీర్ల నిత్యావసర సరకుల వితరణ  

0 37

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 79 వ జన్మదినాన్ని పురస్కరించుకొని  దత్తపీఠాఅనికి అనుబంధంగా ఉన్న శ్రీదత్తా హ్యూమన్ సర్వీసెస్ (వాలంటరీ వ్యవస్థ) అవధూత దత్త పీఠం హైదరాబాద్ శాఖ ఓవరాల్ ఇన్ఛార్జ్, శ్రీ దత్త హ్యూమేన్ సర్వీసెస్ సేవాదళ్ ఫౌండర్ ట్రస్టీ మరియు ఛైర్మన్ కె నారాయణరావు ఆధ్వర్యంలో పేద కళాకారులకు నెలసరి నిత్యావసర వస్తువులను ,దోతులు ,చీరలు అందజేశారు . రామగోపాల్ పేట్ పోలీసు స్టేషన్ పక్కన గల వాలంటరీ కార్యాలయంలో  నేడు ఉదయం కరోనా నియమాలను అనుసరిస్తూ 79 మంది కళాకారులకు ఈ సౌజన్యాన్ని అందజేశారు . కరోనా కష్టకాలంలో నానా అగజాట్లకు లోనైన ఈ కళాకారులు స్వామిజీ చిత్రపటానికి మొక్కి వాలంటరీ సేవాదళ కార్యకర్తలకు సజల నయనాలతో తమ కృతజ్ఞత తెలుపుకున్నారు .నాదస్వరం ,సన్నాయి ,తబలా, హార్మోనీయం  వంటి వాద్యకళాకారులతో పాటు సంగీత నాట్య గురువులకు ,గాయనీ గాయకులకు  ఈ సౌజన్య వితరణ తమ నిత్య సేవాకార్యక్రమాలలో  భాగమని, వాలంటరీ వ్యవస్థ సేవా తపస్వి నారాయణరావు పేర్కొన్నారు .కరోనా మొదటి వేవ్ లో నిత్యం దాదాపు వేయి మందికి ఆహార పొట్లాల వితరణ జరిగిందని ,ఇప్పటికీ మైసూరులో నిత్యాన్నదానం జరుగుతూనే ఉన్నదని అన్నారు .

 

 

 

 

- Advertisement -

ఆరోగ్య శిబిరాల నిర్వహణ ,రక్తదాన శిబిరాలు ,ప్రతీ ఆదివారం దుండిగల్ ఆశ్రమంలో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు ఇవ్వడమే కాకుండా ఉచిత ఆపరేషన్లు కూడా జరుగుతాయని నారాయణరావు పేర్కొన్నారు .స్వామీజీ ఆదేశాల ప్రకారం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల సుసంపన్నత ,విరివిగా అనేక రకాల సేవా కార్యక్రమాల నిర్వహణ ప్రత్యేక తపస్సని ఆయన అన్నారు .నిత్యం వాలంటరీ కార్యాలయంలో కూడా అన్నదానం నిర్వహిస్తామని , కార్యదీక్షా పరులైన వాలంటీర్ల తో చేస్తున్న సేవలకు ముఖ్యమంత్రి కేసిఆర్,కేటీఆర్ , పోలీసు ఉన్నతాధికారులు ,మున్సిపల్ అధికారుల ప్రశంసలు సేవా పురస్కారాలు అందుకున్న ధన్యత ,సార్థకత , సామాజిక సేవ తమదని ఆయన అన్నారు .ఈ వ్యవస్థలో ఎవరైనా  వాలంటీరుగా చేరి సేవా కార్యక్రమాలలో భాగస్తులు కావచ్చని ఆయన తెలిపారు .

 

 

 

 

అయితే ఈనాటి ఈ వితరణ ఎవరి సౌజన్యం కాదని ,కేవలం వాలంటరీ సేవాదళం కలసి సమకూర్చుకున్నదని సేవాదళ్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు . అవధూత దత్త పీఠాధిపతి, జగద్గురు, పరమపూజ్య, డా.   గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 79వ జన్మదినోత్సవాలను పురస్కరించుకొని, వారి దివ్య ఆదేశ ఆశీస్సులతో  కరోనా కష్ట కాలంలో హైదరాబాద్ నగరంలోని 79 మంది సంగీత కళాకారులకు రాణీగంజ్ లోని శ్రీ దత్త హ్యూమేన్ సర్వీసెస్ ఆఫీసు ప్రాంగణంలో ఒక నెలకు సరిపడేలా నిత్యావసర సరుకులను, వస్త్రాలను ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది.ఈ సేవా కార్యక్రమంలో దత్తపీఠ ప్రతినిధులు శ్రీమతి నాగమణి, శ్రీ ప్రసాదరావు, ప్రముఖ పాత్రికేయులు, శ్రీ సచ్చిదానంద కళాపీఠం అధ్యక్షులు  రత్నాకరశర్మతో పాటు సుమారు 20 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. స్వామీజీ  ఈకరోనా కష్టకాలంలో  పేదకళాకారులకోసం స్పందించిన తీరుకు లబ్ధిదారులు తమ సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరిచారు. పలువురు వాలంటీర్లు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తమ సహకారాన్ని అందించారు .

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Distribution of essential goods by Dattapeeth volunteers to poor artists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page