పేరు కోసం ప్రతిష్ట కోసం ఏ రోజు పాకులాడలేదు- సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

0 2

నెల్లూరు ముచ్చట్లు :

 

సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గోలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం వద్ద లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయుర్వేద మందును అందజేసిన తర్వాతనే ఇతరులకు పంపుతామన్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం దక్కాలన్న లక్ష్యంతోనే శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం లో ఈ మహత్తర పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించామన్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కు సంబంధించి పేరు కోసం ప్రతిష్ట కోసం ఏ రోజు తాను పాకులాడలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆనందయ్య ఆయుర్వేద మందును అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆనందయ్య ఆయుర్వేద మందు కు సంబంధించి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: There is no day for prestige for the name- Sarvepalli MLA Kakani Govardhan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page