పోలీసుల తీరు గర్హనీయం

0 23

విశాఖపట్నం ముచ్చట్లు :

 

విశాఖలో కోవిడ్ వారియర్ పై పోలీసులు వ్యవరించిన తీరు అమానుషమని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత అన్నారు.ఉపాది కోసం విశాఖకు వచ్చిన వారిపై పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు.అపర్ణ అనే యువతి పట్ల కర్కశంగా ప్రవర్తించి మానసికంగా ఆవేదనకు గురిచేశారని,కోవిడ్ వారియర్స్ కు ఒకవైపు సన్మానాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రకటనలు చేస్తున్న పోలీసు అదికారులు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె పై కేసులు కూడా పెట్టారని,ఈ విషయం పై హోమ్ మంత్రి ,మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.ఈ విషయం పై నగర కమీషనర్ స్పందించాలని,ఆమె పై పెట్టిన కేసులు ఎత్తువేసి పోలీసులు పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Anita is the state Telugu woman president

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page