ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత

0 15

-ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్
-నూతన స్వీపింగ్ యంత్రాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్ పర్సన్.

జగిత్యాల ముచ్చట్లు :

- Advertisement -

జగిత్యాల పట్టణ పరిశుభ్రత కోసం 14 వ ఆర్థిక సంఘ నిధులు 50 లక్షలతో కొనుగోలు చేసిన నూతన స్వీపింగ్ యంత్రాన్ని సోమవారం పట్టణంలోని టవర్ ప్రాంతంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి  జగిత్యాల పట్టణానికి ఇచ్చిన నిధుల ద్వారా పట్టణ పరిశుభ్రత, పచ్చదనం,పట్టణ అభివృద్ధికి నిధులను వెచ్చిస్తున్నామని, జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత చాలా మంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం, మరియు శివారు ప్రాంతాలు శంకులపల్లి, గోవిందపల్లి, టిఆర్ నగర్ ను పట్టణంలో కలపడం ద్వారా జగిత్యాల పట్టణంలో దాదాపు 20 వేల వరకు జనాభా పెరిగిందని, ఇంతటి జనాభా కోసం పరిశుభ్రత విషయం అనేది కత్తి మీద సామే అని, రాబోయే వర్షాకాలంలో కరోనా, డెంగ్యూ, మలేరియా ఇలా అనేక రోగాలు విజృంభించే అవకాశం ఉన్నదని,అందువల్లనే ఈనాడు స్వీపెంగ్ యంత్రాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు.

 

 

 

 

గతంలో సైతం జగిత్యాల పట్టణ ప్రజల పరిశుభ్రత కోసం 32 ఆటోలు, 8 ట్రాక్టర్లు,1 జెసిబి 1 కొనుగోలు చేశామని, జగిత్యాలలో సేకరించిన చెత్తను జగిత్యాల నూకపల్లి శివారులో దాదాపు 15 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల బాధ్యత భాగస్వామ్యం కూడా అవసరమని ఒక్క అధికారులు మున్సిపల్ పాలకవర్గం వల్ల సాధ్యం కాదని ఆన్నారు. ఆనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూప్రజలు వారి చెత్తను వారికిచ్చిన తడి పొడి బుట్టలలో వేరుగా వేయాలని వాటిని  ఉపయోగించుకోవాలని చెత్తను వేరు చేయడం ఎరువుగా తయారు చేసుకొవచ్చని, ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ఎక్కడ చెత్త,అపరిశుభ్రత ఉంటే అక్కడ రోగాలు  ఉంటాయని ప్రజలు ఆలోచించుకోవాలని సంపాదించిన సొమ్మును అనారోగ్యం బారిన పడి ఖర్చు చేసుకోవడం కంటే కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఇటు ఆరోగ్యాన్ని సంపదను కాపాడుకోవచ్చని ప్రజలు అందరూ సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్,మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Urban sanitation with the participation of the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page