ప్రజా పంపిణీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.

0 10

– రేషన్ డీలర్ల అలసత్వం పై సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్ మెంట్ డిటి ఆగ్రహం

 

నారాయణపేట్  ముచ్చట్లు :

 

- Advertisement -

దుకాణాల నిర్వహణ విషయం లో అలసత్వం ఏమాత్రం ఉపెక్షించేది లేదని , మాట వినక పోతే వేటు తప్పదని పౌరసరఫరాలశాఖ నారాయణ పేట జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. శనివారం నాడు ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం ఐయ్యింది.దీంతో ఆయన సోమవారం నాడు మరికల్, సమీప గ్రామాల్లో  ఉన్న పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాబు..ఇది రేషన్ దుకాణామేనా.. బూత్ బంగ్లా నా.. ఇంతలా బూజు పట్టేదాక ఇంత అలసత్వం అవసరమా..అసలు నీకు దుకాణం అవసరమా?! 24 గంటల్లో శుభ్రం చేయక పోతే నీ దుకాణం బంద్ చేసే అవకాశం మీరే ఇచ్చిన వారు అవుతారని హెచ్చరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..దుకాణాల నిర్వహణ లో ఆవరణ శుభ్రత సైతం ప్రధానమే అన్నారు . ప్రజా పంపిణీ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని పేదలకు అన్నపూర్ణ ఆని పేర్కొన్నారు. నిత్యం ఎంతో మంది ప్రజలకు నిత్యావసర సరుకుల ను అందించే చౌక దుకాణాల ను అపరిశుభ్ర వాతావరణం లో నడపడం డీలర్లకు భావ్యం కాదని స్పష్టం చేశారు. సూక్ష్మ విషయాలే కొన్ని సందర్భాల్లో ప్రధాన అంశాలుగా పరిగణించాల్సి వస్తుందని, అందుకే డీలర్లు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకునే ఆలోచన చేయకూడదని స్పష్టం చేశారు. తనిఖీ సందర్భంగా కొన్ని దుకాణాలు చక్కగా శుభ్రంగా ఉండగా..కొన్ని మాత్రం బూజు పట్టి ఉన్నా..

 

 

 

 

పట్టీ పట్టనట్లు డీలర్లు వ్యవహరిస్తుండటం పై రఘునందన్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇల్లు , వాకిలి శుభ్రంగా పెట్టుకునే అలవాటు ఉన్నపుడు , సేవా భాధ్యత తో నడపాల్సిన రేషన్ దుకాణాల  శుభ్రత ను ఈ కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని ఆదేశించారు.సమయ పాలన తో పాటు , ప్రజల కు అసౌకర్యం కలిగేలా రేషన్ షాపుల్లో శుభ్రత లోపిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని రఘునందన్ హెచ్చరించారు. జాతీయ ఉత్పత్తి పథకం ద్వారా నిర్వహించబడే చౌక దుకాణాల ను  డీలర్లు కనీస పరిశుభ్ర ప్రమాణాలతో నిర్వహించాల్సిన గురుతర బాధ్యత ఈ కరోనా కాలంలో మరింతగా ఉంటుందని గుర్తు చేశారు. రేషన్ షాపు లను ఇష్టానుసారం నిర్వహిస్తాం అని భావించే వారు వారి ఆలోచనకు స్వస్తి పలకాలని , లేకపోతే కేసుల నమోదు కు సైతం వెనకాడేది లేదని రఘునందన్ తీవ్రం గా హెచ్చరించారు. ప్రజల కోసమే రేషన్ షాపులు నడుస్తున్నాయని అలాంటిది ప్రజల ఆదరణ అభిమానం చూరగోనేలా డీలర్లు తమ దుకాణాల ను నడపాలని అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Public distribution is very ambitious.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page