ప్రభుత్వాలు ప్రజలతో చెలగాటమాడుతున్నాయి

0 12

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు :

 

సిరిసిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఈ దీక్షలో  టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గోన్నారు. పొన్నం మాట్లాడుతూ కరోనా,  బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు బిపిఎల్ క్రింది ఉన్నవారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలిజ వేల కోట్లు ఖర్చు పెడదామని చెబుతున్న ముఖ్యమంత్రి తెలంగాణలో అనేకమంది రోగాలతో చనిపోతున్నా కరోనా బారిన పడుతున్న శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ దొరుకుతుంది కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకడం లేదు ఇంతకంటే దౌర్భగ్యం పరిస్థితి లేదని అన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Governments are messing with the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page