మద్యంషాపులో దొంగతనం-వాచ్ మెన్ కు కత్తిపోట్లు

0 21

జంగారెడ్డిగూడెం ముచ్చట్లు :

 

జంగారెడ్డిగూడెం పట్టణంలోని 217 నెంబర్ గల ప్రభుత్వ మద్యం దుకాణంలో  దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు అడ్డుగా వచ్చిన రమణ అనే సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి  షాపు ఐరన్ గ్రిల్ ను కట్టర్లతో తొలగించి చోరీకి పాల్పడ్డారు.ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం  లో స్థానిక శ్రీనివాసపురం రోడ్డులో ఒక ప్రయివేటు స్కూల్ సమీపంలో ప్రభుత్వ  మద్యం దుకాణాన్ని కలదు.  అర్ధరాత్రి దాటిన సమయంలో దుండగులు మద్యం దుకాణం లో చొరబడడానికి యత్నించడం తో కాపాలదారుడిగా ఉన్న రమణ దుండగులని అడ్డు కొవటంతో  కత్తి తో గాయపరిచారు. దీనితో రమణ  కేకలు వేయడం తో దుండగలు అక్కడ నుండి పారిపోయారు. గాయపడ్డ రమణ ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినారు. పోలీసులు , ఎస్ ఈ బి అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వెలు ముద్రలు సేకరించే కేస్ నమోదు చేశారు. దుకాణం లో నగదు  , మద్యం సీసాలు దొంగలించబడ్డాయా లేదా అనేది దాని పై కూడా విచారణ చేపట్టారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Theft in the liquor store — stabs to watchmen

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page