మహ్మద్ ఇక్బాల్ కు మండలి ఛైర్మన్

0 15

అనంతపురం ముచ్చట్లు :

 

మహ్మద్ ఇక్బాల్ కు వరస పదవులు వైసీపీలో ఊరిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సయితం ఇక్బాల్ కు పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహ్మద్ ఇక్బాల్ కు ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు. ఈసారి శాసనమండలి ఛైర్మన్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఛైర్మన్ షరీఫ్ పదవీ కాలం పూర్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ ను మండలి ఛైర్మన్ చేయాలని జగన్ భావిస్తున్నారు.మహ్మద్ ఇక్బాల్ పోలీసు అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన నేత అయిన మహ్మద్ ఇక్బాల్ ను జగన్ హిందూపురం నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలు అయ్యారు. మహ్మద్ ఇక్బాల్ కు ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని జగన్ రెన్యువల్ చేయడం విశేషం. మైనారిటీ కోటాలో ఈ అవకాశం దక్కింది.మరోవైపు మహ్మద్ ఇక్బాల్ నమ్మకమైన నేతగా జగన్ మదిలో ముద్రపడ్డారు.

 

 

 

- Advertisement -

దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి గట్టి పోటీ ఇవ్వాలన్నా మహ్మద్ ఇక్బాల్ కు కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వాలన్నది జగన్ ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. హిందూపురం లో బాలకృష్ణను దెబ్బకొట్టాలంటే మహ్మద్ ఇక్బాల్ కు మంత్రి పదవి కాని, మండలి ఛైర్మన్ పదవి కానీ ఇవ్వాలని జగన్ తొలుత భావించారుఅయితే మండలి ఛైర్మన్ పదవి ఖాళీ కావడంతో మహ్మద్ ఇక్బాల్ కు ఆ పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటు మైనారిటీ కోటా కింద మండలి ఛైర్మన్ పదవి ఇస్తే హిందూపురంలోనూ మహ్మద్ ఇక్బాల్ నిలదొక్కుకుంటారని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకోసమే మహ్మద్ ఇక్బాల్ కు మండలి ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. మొత్తం మీద మహ్మద్ ఇక్బాల్ వైసీపీలోకి నక్కను తొక్కి వచ్చారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Mohammad Iqbal is the chairman of the council

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page