రూ. 40.95 లక్షల విలువ గల 35 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణ

0 9

-జువారి సిమెంట్స్  దాతృత్వం అభినందనీయం,
-జిల్లా తరపున ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ సి. హరికిరణ్

కడప ముచ్చట్లు :

 

- Advertisement -

రూ. 40.95 లక్షల విలువ గల 35 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను  వితరణ చేసిన.. జువారి సిమెంట్స్ వారి దాతృత్వం అభినందనీయం అని.. జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ అన్నారు.సోమవారం కలెక్టర్ చాంబర్లో కడప జువారీ సిమెంట్స్ వారు రూ. 40.95 లక్షల విలువ గల 35 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ తో పాటు 200 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్, 30 ఆక్సిజన్ సిలెండర్స్ ట్రోలిలు, 200 ఆక్సిజన్ నాజల్ పైప్స్ ను జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ కు అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ… జిల్లాలో  కొవిడ్ రెండో దశను  సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు … జిల్లా ప్రజలకు ప్రాణవాయువును అందించేందుకు స్వచ్చందంగా  ముందుకు వచ్చి రూ. 40.95 లక్షల విలువ గల 35 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 200 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్, 30 ఆక్సిజన్ సిలెండర్స్ ట్రోలిలు, 200 ఆక్సిజన్ నాజల్ పైప్స్ ను అందించిన జువారీ సిమెంట్స్ వారికి  జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.   వీటిని జిల్లాలో అవసరమైన ఆసుపత్రులకు పంపిణీ చేస్తామన్నారు.

 

కోవిద్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం.. పటిష్టమైన చర్యలు చేపడుతోందన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని అన్నారు. అత్యవసరమైతేనే  ఇంటి నుండి బయటకు వెళ్లాలని, ఖచ్చితంగా మాస్కు ధరించి .. సామాజిక దూరం పాటించి.. జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా తీర్చి దిద్దెందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జువారీ సిమెంట్స్  ప్లాంట్ హెడ్ జి.ఎన్. బి. రావు, హెచ్.ఆర్. హెడ్ అశిష్ రెడ్డి, మైన్స్ హెడ్ కె.వి.ఎస్. శర్మ, మైయింటెనెన్సు హెడ్ ఎం. కె. జైన్, ప్రోక్యూర్మెంట్ హెడ్ కె.వి.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Rs. Distribution of 35 Oxygen Concentrators worth Rs 40.95 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page