లక్ష దాటిన కరోనా మరణాలు

0 29

ముంబై ముచ్చట్లు :

 

మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ఆదివారం 233 మందితో కలిపి రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా ఇప్పటివరకు 1,00,130 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 12,557 మంది కరోనా బారిన పడటంతో మొత్తం కేసుల సంఖ్య 58,31,781కు చేరింది. తాజాగా 14,433 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 55,43,267కు పెరిగింది.రికవరీ రేటు 95.05 శాతం, మరణాల రేటు 1.72 శాతంగా ఉంది. రాష్ట్రంలో 1,85,527 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్కరోజులో చేసిన 2,37,514 పరీక్షలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,65,08,967 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ముంబైలో కొత్తగా 786 కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. ముంబై డివిజన్‌లో తాజాగా 2,420 మంది కరోనా బారిన పడగా 33 మంది మృతిచెందారు. నాసిక్‌ డివిజన్‌లో 1,194, పుణే డివిజన్‌లో 2,999, కొల్హాపూర్‌ డివిజన్‌లో 3,864, ఔరంగాబాద్‌ డివిజన్‌లో 373, లాతూర్‌ డివిజన్‌లో 570, అకోలా డివిజన్‌లో 718, నాగ్‌పూర్‌ డివిజన్‌లో 419 కేసులు నమోదయ్యాయి.

 

 

 

- Advertisement -

లక్షకు చేరిన కరోనా కేసులు…

 

దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2427 మంది మృతిచెందారని, కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించారు.ఇక దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 36,63,34,111 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,87,589 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Corona deaths exceeding one lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page