వ్యభిచారం చేయించిన తండ్రి.

0 59

గుంటూరు ముచ్చట్లు :

 

కంటిటికి రెప్పలా కాచి కాపాడాల్సిన తండ్రి లాంటి వ్యక్తే.. ఆమె జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. ఆదరిస్తాడనుకున్న వ్యక్తే మురికికూపం లాంటి వ్యభిచారరొంపిలో దించేశాడు. చివరికి, ఒళ్లు అమ్మి సంపాదించిన డబ్బును కూడా ఆ నీచుడు చెరబట్టాడు.గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒళ్లుగగుడ్పొడిచే సంఘటన చోటుచేసుకుంది.తనతో పాటు తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబైలో వ్యభిచారం చేయించి ఆ డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారంటూ ఓ మహిళ వాపోయింది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహితనరసరావుపేట వన్‌ టౌన్‌ పోలీసులకు  ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.ప్రభాకరరావు తెలిపిన వివరాల మేరకు.. 22 ఏళ్ల వయసులోనే యువతి.. భర్తతో విడిపోయింది. ఏ దిక్కూ లేక 2017వ సంవత్సరంలో పెద్ద కుమార్తెతో కలిసి నరసరావుపేటలోని ప్రకాష్‌ నగర్‌లో నివాసం ఉంటున్న తల్లి వద్దకు చేరుకుంది.అయితే, అప్పటికే ఆమె తల్లి.. వినుకొండకు చెందిన దూదేకుల మీరావలితో అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లు బాగానే ఉన్న మీరావలి.. తర్వాత, తన నీచబుద్ధి బయటపెట్టాడు. తాను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే వివాహితను, ఆమె కుమార్తెను చంపేస్తానని మీరావలి భయపెట్టాడు.మీరావలి చెప్పిన పని చేసేందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబై తరలించి 9 నెలల పాటు వ్యభిచారం చేయించారు.

 

 

 

 

- Advertisement -

వచ్చిన డబ్బును బాధిత యువతి కుమార్తె పేరుపై వేస్తామని నమ్మబలికారు. అయితే, మీరావలి, సైదా ఆ యువతి సంపాదించిన డబ్బును తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు.9 నెలల తర్వాత నరసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని ప్రశ్నించగా.. తనను కొట్టి మళ్లీ బలవంతంగా 5 నెలల పాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యవభిచారం చేయించారని బాధిత యువతి పేర్కొంది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఆ యువతి.. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని తాను నిర్ణయించుకుంది. అయితే, మళ్లీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనతో బలవంతంగా వ్యభిచారం చేయించడమే కాకుండా.. తాను సంపాదించిన సుమారు రూ. 15 లక్షలు కాజేసిన మీరావలి, సైదాపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె వేడుకుంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రావు వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The father who committed adultery.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page