సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న జువ్వాడి

0 12

కోరుట్ల ముచ్చట్లు :

 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు సోమవారం సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్నారు. రాష్టంలో కరోనా మరియు బ్లాక్ పంగన్ వ్యాధులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణారావు దీక్ష చేపట్టారు.

- Advertisement -

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం-టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు

టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఇంట్లో సత్యాగ్రహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ లు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు.సోమవారం స్థానిక పత్రిక విలేకరుల తో జువ్వాడి కృష్ణా రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బ్లాక్ పంగస్ వ్యాధుల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అయినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం ప్రతి పక్షంగా బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో గాంధేయ పద్ధతిలో కరోనా నిబంధన లు పాటిస్తూ సత్యాగ్రహం చేస్తున్న నాయకులను పోలీస్ లు అక్రమంగా ఇళ్లలోకి చోరబడి అరెస్ట్ లు చేసి మల్లాపూర్ సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారని అరెస్ట్ చేసిన నాయకులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

 

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రా ? కేటీఆర్  పోలీస్ అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారు. కోరుట్ల నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న పుర పాలక మంత్రి కేటీఆర్ ముప్పై నెలల క్రితం కోరుట్ల పట్టణంలో వందపడకల ఆసుపత్రి ని సంవత్సరం లో పూర్తి చేసి ప్రజలకు అప్పచెపు తనని హామీ ఇప్పటికి కనీసం పనులు కూడ ప్రారంభం చేయలేదని, అలాగే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యా లయంలో సిబ్బంది లేకపోవడం తదితర ఇచ్చిన హామీలు నేటికీ ఎందుకు పూర్తి చేయలేదో నియోజకవర్గం ప్రజలకు చెప్పాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Juvvadi participating in Satyagraha initiation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page