ఆనందయ్య ఫార్ములా కోవిడ్ మెడిసిన్

0 18

రాజమండ్రి ముచ్చట్లు :
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేకమంది ప్రాణాలను బలిగొన్న తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేదంతో కరోనాకు చెక్కు పెట్టాలని  తయారుచేసిన మందు సత్ఫలితాలను ఇవ్వడంతో ఇదే ఫార్ములాతో తమ వంతు కృషి చేస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి, కొమరిపాలెం గ్రామాలకు చెందిన పలువురు ఈ మందును అదే ఫార్ములాతో తయారు చేస్తూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
నియోజకవర్గంలోని  అనపర్తి కి చెందిన నల్లమిల్లి రామచంద్రారెడ్డి చంద్రకళ దంపతులు, కొమరిపాలెం గ్రామానికి చెందిన కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి జ్యోతిర్మయి దంపతులు ఈ మందును తయారు చేయించేందుకు ముందుకు వచ్చారు. ముందుగా కోవిడ్ సోకకుండా శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే విధంగా ఆనందయ్య ఫార్ములాతో ఆయుర్వేద మందు తయారీకి శ్రీకారం చుట్టారు.  ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన విధంగా నిరోధక శక్తి పెంపొందించే వివిధ రకాల వనమూలికలను సేకరించి గ్రామానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు మణికంఠ స్వామి ఆధ్వర్యంలో  మందు తయారీ చేపట్టారు.  ఇప్పటికీ సుమారుగా 27 వేల మందికి ఈ మందును పంపిణీ చేశారని ఈ మందు తీసుకున్నవారిలో ఎక్కువ శాతం కోవిడ్ బారిన పడకపోవడంతో ఈ మందుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. దీంతో ఆయా గ్రామాలలో నిర్వాహకులు ముందుగా మందులు తయారుచేసి  ఇంటింటికి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టారు.  ఈ మందు తయారీలో  మన మూలికలను శుభ్రపరిచేందుకు అనపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగమ్మ చారిటీస్ ఆధ్వర్యంలో లో నిర్వహిస్తున్న మహిళ వృద్ధాశ్రమం లోని వృద్ధులు తాము సైతం అంటూ ఉత్సాహంగా పనులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అనపర్తి పరిసరాల్లోని యువకులు తాము సైతం అంటూ మందు తయారీ కి కష్టపడి పని చేస్తున్నారు  మందు తయారీకి అన్ని విధాల సహకరిస్తున్న వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Anandayya Formula Kovid Medicine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page