ఆన్ లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు

0 13

ఖమ్మంముచ్చట్లు :

ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కావడంతో ప్రభుత్వం వారి కోసం అన్ని వసతులు కల్పిస్తున్నది. అధ్యాపకులు ఇంటర్మీడియట్‌తో పాటు ఎంపీసీ విద్యార్థులకు ఎంసెట్‌, ఐఐటీ వంటి పోటీ పరీక్షలు, బైపీసీ విద్యార్థులకు నీట్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన సాధారణ విద్యార్థులు అనేక మంది రాష్ట్ర స్థ్ధాయి ర్యాంక్‌లు సాధించారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్‌లు సాధించి ప్రభుత్వ కళాశాలల సత్తాను చాటారు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఆదరణ పెరుగుతున్నది. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద్వారా అడ్మీషన్లు పొందేలా అవకాశం కల్పించింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుఇంటర్మీడియట్‌ బోర్డు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం కోర్సులో చేరేందుకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా తొలుత విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో లాగిన్‌ అనంతరం జిల్లాలోని తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. వచ్చే నెల 5వ తేదీ వరకు అడ్మీషన్లు పొందేందుకు గడువు ఉన్నది. జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా వీటిలో జనరల్‌ కోర్సులతో పాటు ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులో విద్యార్థులు అడ్మీషన్‌ పొందవచ్చు. కొవిడ్‌ పరిస్థితులు నెలకొన్నప్పటికీ గతేడాది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు అధ్యాపకులు పాఠాలు బోధించారు. అవసరమైతే ఆన్‌లైన్‌ తరగతులూ నిర్వహించారు. కార్పొరేట్‌కు దీటుగా ఆన్‌లైన్‌, యూట్యూబ్‌ నుంచీ పాఠాలను బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రవిబాబు అడ్మీషన్లు పెంచేందుకు కృషి చేయాలని ఆయన ప్రిన్సిపాల్స్‌కు సూచించారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Inter admissions online

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page